జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంటలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ వనమహోత్సవ కార్యక్రమంలో గురువారం పాల్గొని మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జనగామ ప్రోబిషన్ ఎక్సైజ్ శాఖ పురపాలక శాఖ ఆధ్వర్యంలో 45 గిరిగతాటి చెట్లను నాటారు. ఈ సందర్భంగా చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ సూచించారు .చెట్లను నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.