మెదక్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు, యూరియా కోసం రహదారి పై బైఠాయించి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం వందలాది మంది రైతులు పడిగాపులు కాస్తున్నారు. పది రోజులుగా యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఉదయం 6 గంటల నుంచి యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. యూరియా కోసం వచ్చిన రైతులందరికీ యూరియా దొరకకపోవడంతో చేగుంట మెదక్ ప్రధాన రహదారిపై కూర్చొని రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులందరికీ సరిపడా యూరియాను వెంటనే అందించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.