సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ విద్యార్థినిలకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, ఈవిటీజింగ్ నూతన చట్టాల గురించి గురువారం త్రీటౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిద్దిపేట షీటీమ్ బృందం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. పోలీసులు అంటే భయం వేడాలి ఏదైనా ఉంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి, పరీక్షలు అంటే భయపడవద్దు, ప్రతి విద్యార్థికి చదువు చాలా ముఖ్యం, ఎవరికన్నా ఏదైనా జరిగితే మనకెందుకులే అని నిర్లక్ష్యం చేయకూడదు, ఉన్నతంగా చదువుకుని పై స్థాయికి వెళ్ళాలి, ఒక మ