కడప నగరంలో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. కడపలోని అప్సర సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాలలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అప్సర నుంచి ఆర్టీసీ బస్టాండుకు వెళ్లే దారిలో రోడ్లు పూర్తిగా జలమయం కావటంతో ఆ రోడ్డు వైపు వాహనాలు వెళ్లకుండా రోడ్డును మూసివేశారు.