డీఆర్ డిపో డీలర్లకు ఈ పాస్ యంత్ర పరికరాలను జేసీ అభిషేక్ సోమవారం క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసారు. పాడేరు మండలంలో ఉన్న 45డీఆర్ డిపోలలో 65ఏళ్లు నిండిన లబ్దిదారులకు పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. రేషన్ పంపిణీని పారదర్శకంగా పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. అంచెలంచెలగా జిల్లా వ్యాప్తంగా ఉన్న డీఆర్ డిపో డీలర్లకు ఈ పాస్ యంత్రాలు పంపిణీ చేస్తామన్నారు.