గోపాలపట్నం పోలీస్ స్టేషన్ సమీపంలో దిక్కుతోచని స్థితిలో మతి స్థిమితం సరిగ్గా లేని ఒక యువతిని మంగళవారం గుర్తించి, వెంటనే స్పందించిన గోపాలపట్నం పోలీసులు ఆమెకు ఆహారం మరియు బట్టలు సమకూర్చి, ఆమెను చికిత్స నిమిత్తం మానసిక ఆసుపత్రికి అప్పగించడం జరిగింది. డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారు గోపాలపట్నం పోలీస్ సిబ్బందిని అభినందించారు.