డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చుకుందామని సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను, రాజగోపాలపేట ఎస్ఐ వివేక్ లు అన్నారు. యాంటీ డ్రగ్ నిర్మూలనలో భాగంగా రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలోని క్రీడాకారులను యువతను ప్రోత్సహించే విధంగా క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్ ను శుక్రవారం ముండ్రాయి గ్రామంలో వారు ప్రారంభించారు. నేటి యువతరాన్ని డ్రగ్స్ కు దూరంగా ,చెడు వ్యాసనాలు విడి ఆటలు, మన సంస్కృతి వైపు మళ్ళించడం గురించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాలలో యువకులను ప్రోత్సహి