కుందుర్పి మండలం శీగల పల్లి గ్రామంలో గతంలో ప్రభుత్వం గ్రామ శివారులో ఎస్సీ కులస్తులకు ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలు మంజూరు చేసింది. అయితే గ్రామంలోని మరో వర్గం వారు ఎస్సీలకు ఇచ్చిన స్థలాలను ఆక్రమించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. పెద్దలు సర్ది చెప్పడంతో తాత్కాలికంగా వివాదం సద్దుమణిగింది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.