దోమల నివారణకు పకడ్భందీగా చర్యలు: పంచాయతీ కార్యదర్శి గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో మురికి కాలువలు, నీటి కుంటల వద్ద మలేరియా ప్రబలకుండా దోమల నివారణకు సర్పంచ్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మేజర్ పంచాయతీ కార్యదర్శి సతీశ్ తెలిపారు. ఆదివారం పంచాయతీ సిబ్బంది ద్వారా దోమల నివారణకు ద్రవాన్ని పిచికారి చేయించినట్లు ఆయన తెలిపారు. గ్రామ ప్రజలు కూడా ఇండ్ల ముందర, నీరు నిలువ ఉండగా చర్యలు తీసుకోవాలన్నారు. దోమ తెరలను వినియోగించాలని సూచించారు.