తల్లాడ పట్టణం నందు బీసీ సెల్ అధ్యక్షులు గోగుల రాఘవ ఆధ్వర్యంలో బీసీలకు42% రిజర్వేషన్లు చారిత్రాత్మకం గా చేసినందుకు తల్లాడ రింగురోడ్ సెంటర్ నందు బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసినారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, ఖమ్మం జిల్లా మంత్రివర్యులకు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు మతి మట్టా రాగమయి దయానంద్ విజయకుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బీసీ సెల్ అధ్యక్షులు అందరూ పాల్గొన్నారు