ఎగువన కురుస్తున్న భారీ వర్షలతో పాటు ఎస్ఆర్ఎస్పి, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి పెద్దఎత్తున వరద నీరు చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి గురువారం ఉదయం నుండి దిగువకు 8 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేయగా ఇన్ ఫ్లో వరద ప్రవాహం తగ్గడంతో రాత్రి 7 గంటల ప్రాంతంలో 5,77,397 క్యూసెక్కుల నీటిని 38 గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు. దీంతో గోదావరి ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసిలు కాగా ప్రస్తుతం 16 టిఎంసిలకు నీరు చేరింది.