ఈదేశ కమ్యూనిస్టు పోరాట యోధుడు నడిగడ్డ ముద్దుబిడ్డ తాడిత పీడిత పేద ప్రజల పక్షాన నిరంతరం తన జీవితాన్ని అంకితం చేసి ఉద్యమించిన నాయకుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి యెక్క సంస్మరణ సభను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు పిలుపునిచ్చారు.శనివారం మధ్యాహ్నం స్థానిక గద్వాల పట్టణంలోని సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు..కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఈనెల 22వ తేదిన రాత్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ హైదరాబాద్ లో మరణించిన సంగతి అందరికి తెలిసిందే అన్నారు..