దైవ కార్యక్రమాల్లో సైతం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అవినీతికి పాల్పడుతున్నాడని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా ఆరోపించారు. గుంటూరులోని వైసిపి కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా మహోత్సవాల కమిటీ సభ్యుల నియామకం కోసం ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారని చెప్పారు. దేవుడు జోలికి వెళ్లడం అంత మంచిది కాదని హితవు పలికారు.