గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో బిజెపి నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. సోమవారం మండల అధ్యక్షుడు కావలి ఐలేష్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ విగ్రహ నుండి తహసిల్దార్ కార్యాలయానికి వరకు ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ పరమేష్ కి మున్సిపాలిటీలోని సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ వద్దంటూ నినాదాలు చేశారు. అన్నారంలోని సర్వేనెంబర్ 216 బాధితులకు న్యాయం చేయాలన్నారు.