కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సి ఆర్ పాటిల్ ముఖ్య అతిథులుగా ఢిల్లీలో ఈనెల 15న జరిగే క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(QCI) నిర్వహించే సర్పంచుల సమావేశానికి వజ్రకరూర్ గ్రామ సర్పంచ్ అయిన తనకు ఆహ్వానం అందిందని సర్పంచ్ మోనాలిసా శుక్రవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. ప్రధానంగా స్వచ్ఛ సుజల్,నారిబల్ మిత్ర, సుశాసిత్ సమృద్ధి,సురక్ష, స్వస్తి సంపన్న పంచాయితీల ప్రాతిపదికన సర్పంచ్లను ఎంపిక చేశారన్నారు. దేశం మొత్తం మీద 75 మంది సర్పంచులు మాత్రమే ఈ సదస్సులో పాల్గొంటారని సర్పంచ్ మోనాలిసా పేర్కొన్నారు.