సంతనూతలపాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మరియు మాజీమంత్రి మేరుగ నాగార్జున సోమవారం జిల్లా కేంద్రమైన ఒంగోలు కలెక్టరేట్ కు వచ్చారు. ఆ సమయంలో కొందరు దివ్యాంగులు తమ పెన్షన్లను తొలగించాలని తమకు న్యాయం జరిగేలా చూడాలని నాగార్జునకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అర్హత గల దివ్యాంగుల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం అన్యాయం అన్నారు. దివ్యాంగుల పెన్షన్లు తొలగింపు గురి కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా కు నాగార్జున వినతి పత్రాన్ని అందజేశారు.