వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ అదే పాఠశాలలో నగదు ఎత్తుకెళ్లిన వ్యక్తిని రిమాండ్ కు తరలించిన పోలీసు అధికారులు. వైదేహి నగర్ లోని నారాయణ స్కూల్లో మితేష్ సెక్యూరిటీ గాటుగా పనిచేస్తున్నాడు. గత నెల 12న స్కూల్లో ఎవరు లేని సమయంలో 6.79 లక్షల నగదును తీసుకొని పారిపోయాడు. దీంతో మితేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు 6.20 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.