పలమనేరు: పట్టణంలో సుమారు 8 గంటల సేపు ఒంటరి ఏనుగు అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపించింది. దానిని అడవిలోకి పంపించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు అధికారులు. సబ్ డి ఎఫ్ ఓ వేణుగోపాల్ మాట్లాడుతూ,ఒంటరి ఏనుగు జనావాసాల్లోకి రావడంతో అటవీశాఖ అధికారులందరూ దానిని అడవిలోకి తిరిగి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నం చేసామన్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఎస్ఓ సుకుమార్ పై ఏనుగు దాడి చేసింది, మరోచోట ఆవు దూడపై దాడి చేసి గాయపరిచింది మరెక్కడ గాని ప్రజలకి ఏనుగు వలన ఇబ్బంది లేకుండా అడవిలోకి తరలించడం జరిగిందన్నారు.ముఖ్యంగా ఏనుగును అడవిలోకి తరలించడానికి కృషిచేసిన మీడియా మిత్రులకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.