పలమనేరు: అటవీ రేంజ్ పరిధిలో ఏనుగుల దాడులతో పంట, ప్రాణ మరియు ఆస్తి నష్టపోయిన 80 మంది బాధితులకు 12.77 లక్షల విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఏనుగుల దాడుల నుంచి పంట మరియు ప్రాణ నష్టాల నివారణకు ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే కుంకీ ఏనుగుల ప్రాజెక్టు తీసుకురావడం జరిగిందన్నారు. త్వరలో టెక్నాలజీతో పాటు కుంకీల ద్వారా పూర్తిగా ఏనుగుల దాడులను నివారించనున్నామన్నారు. రైతుల పంటలకు నష్టం జరగకుండా ఏనుగుల కదలికలను గుర్తించే విధంగా చిప్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.