మంచిర్యాల జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సమీకృత కలెక్టరేట్లో అటవీ భూముల ఆక్రమణల నిరోధంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో జిల్లా టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని, అటవీ చట్టాలను ఉల్లంఘించి అటవీ భూముల ఆక్రమణకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికే అడవి భూములను ఆక్రమించుకున్న వారికి నోటీసులు జారీ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.