జిల్లా ఎస్పీ శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదంతో, నగరంలోని ప్రకాష్ నగర్ లో ఉన్న ప్రభుత్వ ఎస్.సి బాలుర హాస్టల్ ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు శుక్రవారం రాత్రి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నచౌకు ఎస్.ఐ రాజరాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు.