వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వర్షాకాలంలో వ్యాదులు నియంత్రించ వచ్చని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ అన్నారు. వర్షాకాల పరిశుభ్రత అనే అంశంతో శనివారం మధ్యాహ్నం 1గంట సమయంలో స్థానిక ఎపి ఆర్ కళాశాల మైదానంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షా కాలంలో తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలను వివరించారు. విద్యార్ధులు సెలవులకు ఇళ్లకు వెళ్లినపుడు తలిదండ్రులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, దోమతెరల వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. చేతులను పరిశుభ్రంగా కడిగితే నలభై శాతం వ్యాదులకు దూరం కావచ్చన్నారు.