పుట్టపర్తి పట్టణ సమీపంలోని చిత్రావతి నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లు పెట్టి కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఇలా అక్రమంగా తోడుతూ పోతే భవిష్యత్తులో ఇసుక అనేది బంగారం అవుతుందని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు