నిజామాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి పది రోజుల జైలు శిక్ష, మరో 15 మందికి జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. అయితే ఇటీవల డ్రంక్ అండ్ డ్రైవ్ లో 16 మందిపై కేసు నమోదు చేశారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించి గురువారం మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా 15 మందికి 21500/- జరిమన విధించగా బోర్గాoకు చెందిన చామకూర కల్పతి డ్రంక్ అండ్ డ్రైవ్ లో మూడుసార్లు పట్టుబడడంతో అతనికి పది రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.