హన్మకొండ రెడ్డీ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ యువతితో సునీల్ అనే యువకుడు ఎంగేజ్మెంట్ చేసుకొని మరో యువతిని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో విషయం తెలుసుకుని ఖమ్మంకు చెందిన బాధితుల బంధువులు యువకుడి ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో గంటన్నరకు పైగా యువకుడు ఇంట్లో దాక్కున్నట్లు సమాచారం. ఎంగేజ్మెంట్ సమయంలో రూ.15 లక్షల క్యాష్, భూమి పత్రాలు ఇచ్చామని బాధితులు ఆరోపిస్తున్నారు.