తాడ్వాయి : డెంగ్యూ, డయేరియా లాంటి వ్యాధులు వ్యాపించకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామంలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంచాయతీ సిబ్బందితో కలిసి నిలువ ఉన్న నీటిని డబ్బాల నుండి కింద పారబోశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురిచిన అధిక వర్షాల వలన ఎక్కడపడితే అక్కడ నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్నందున పంచాయతీ సిబ్బంది జాగ్రత్తగా నీరు నిలువ ఉన్న ప్రాంతాలను గుర్తించి నీరు బయటకు పోయేలా చూడాలన్నారు.