రోడ్డు ప్రమాదంలో బెంగళూరుకు చెందిన మునిరెడ్డి (58) తీవ్రంగా గాయపడ్డాడు. పీలేరుకు సొంత పనిపై గురువారం బైకులో వచ్చాడు. తిరుగు ప్రయాణంలో శుక్రవారం ఉదయం మదనపల్లె శానిటోరియం వద్ద, నాలుగు లైన్ల జాతీయ రహదారి క్లోస్ చేసి ఉండడంతో డివైడర్ ను ఢీకొని ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని 108లో స్థానిక మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన వైద్య చికిత్సలు అందించగా కోలు కుంటున్నాడు..