నారాయణగూడ శాంతి థియేటర్ సమీపంలో ఈస్టజోన్ టాస్క్ ఫోర్స్, నారాయణగూడ పోలీసుల సంయుక్త దాడిలో ₹1.92 కోట్ల రద్దైన కరెన్సీతో నలుగురు అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితుడు బెంగళూరు వాసి ముల్లా అబ్బాస్ అలీ గతంలో ఇలాంటి కేసులో అరెస్టై, సహచరులతో కలిసి మళ్లీ అక్రమ మార్పిడి కొనసాగించాడని గుర్తించారు. పోలీసులు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు