విశాఖ అంటేనే సాగరతీరం. అక్కడే ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది. ఇక్కడ ఎన్నో రకాల సముద్ర చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతాయి. చేపలే జీవనాధారంగా వేటసాగించే మత్స్యకారులు వాటిని ఎన్నో రూపాల్లో విక్రయిస్తుంటారు. అలాంటి వాటిలో పచ్చిగా ఉన్న చేపలు ఒకటైతే ఎండు చేపలు కూడా ఒక రకం. పచ్చి చేపల టేస్ట్ ఎలాగూ చాలామందికి తెలుసు. అయితే ఎండు చేపలు కూడా అంతే రుచి, ఆరోగ్యాన్ని ఇస్తాయట. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో దాదాపు పన్నెండు జెట్టీలు ఉన్నాయి. సుమారు నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉందీ ఏరియా. ఇక్కడయ చేపల్ని ఇలా జెట్టీలకు ఇవతల ఎండబెడతారు.