ప్రస్తుత వర్షాకాలంలో పాములు ఎక్కడైనా సంచరించే ఆస్కారం ఉందని, అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రైతు హమీద్ శనివారం పొలం వద్దకు వెళ్లారు. సర్వీస్ తీగపై పొడవుగా ఉన్న పామును గమనించి ఫోనులో ఫొటోలు, వీడియోలు తీశారు. పాములు పొలాల్లో, గట్ల వెంబడి సంచరించడం సహజమే కానీ.. ఇలా విద్యుత్తు తీగపై సేదదీరడం చూడలేదని పేర్కొంటూ ఆయన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు.