వరంగల్ నగరంలో జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఉదయం 11:30 గంటలకు ఎంజీఎం కూడలి నుండి సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోచమ్మ మైదాన్ ఎంజీఎం సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం జీరో ఖర్చు జీరో పొల్యూషన్ 100% ఆరోగ్యం లభిస్తుందని ఆయన తెలిపారు.