అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్ అన్నారు. బుధవారం సిరికొండ మండలంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ఎంఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణి చేశారు. అనంతరం స్థానిక శివాలయానికి రోడ్డు పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఆయన వెంట మండల నాయకులు ఉన్నారు.