వంట నూనె అనుకొని గడ్డి మందు వేసి దుంప కూర వండిన మహిళ ఉదంతం పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ పనసభద్ర గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఇంటిలో టీవీ ప్రక్కనున్న వంట నూనె డబ్బాకు బదులు గడ్డి మందు డబ్బా తీసి వండిన దుంప కూరలో వేసి ఇంట్లో ఉన్న ఆరుగురు వ్యక్తులకు వడ్డించింది. అది తిన్న ఆరుగురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికులు వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు వివరాల నమోదు చేసినట్లు తెలిపారు.