గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని శ్రీ నాగేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం ఉచిత యోగా శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిర్వాహకుల ప్రకారం, ప్రాణాయామం, యోగా ద్వారా అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. ఈ 21 రోజుల శిబిరం ప్రతిరోజూ ఉదయం 5 నుండి 7 గంటల వరకు జరుగుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుడు కోటేశ్వరరావు కోరారు.