అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జ్ వై. విశ్వేశ్వర్ రెడ్డి రైతు విభాగ సమావేశంలో మాట్లాడుతూ. ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని హంద్రీనీవా నీటిని ఎన్ని ఎకరాలకు అందించారో చెప్పే దమ్ము మంత్రి పయ్యావుల కేశవ్ కు ఉందా అని ధ్వజమెత్తారు. ఈనెల తొమ్మిదిన గుంతకల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట జరిగే ధర్నాకు వేలాదిగా రైతులు తరలిరావాలని విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.