క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సంగారెడ్డిలోని అంబేడ్కర్ మైదానంలో క్రీడా పోటీలను శనివారం ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామీణ స్థాయిలో ఆడే క్రీడాకారులు జాతీయస్థాయి వరకు రాణించాలని పేర్కొన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శరీరం దృఢంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో క్రీడా సంఘాల నాయకులు పాల్గొన్నారు.