ఎమ్మిగనూరు: గాజులదిన్నె ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేత: తహశీల్దార్..అల్పపీడనంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గాజులదిన్నె ప్రాజెక్ట్ (సంజీవయ్య సాగర్) నిండుకుండలా ఉంది. గాజులదిన్నె జలాశయంలో 376.54 మిల్లీమీటర్ నీరు వచ్చి చేరడంతో ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వేసి దిగువకు నీరు వదులుతున్నట్లు తహశీల్దార్ రాజేశ్వరి తెలిపారు. ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామ ప్రజలు హంద్రీలో వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.