కూటమి ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలలు ఉంటే రాష్ట్రంలో అనేక సమస్యలపై వామపక్షాలు, వైసీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం దౌర్భాగ్యం అని మంగళవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ కార్య క్రమాలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక తుంగలోతొక్కడం చంద్రబాబుకు ఆనవాయితీ అన్నారు.