కత్తిపోట్లకు గురైన ఓ యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఎస్ఐ మధుసూదన్ రావు తెలిపిన వివరాల మేరకు శ్రీకాకుళం జిల్లా జి సిగడా మండలం గడ్డకంచరానికి చెందిన రాజశేఖర్ గోబ్బురు గ్రామస్తుడైన శంకర్ల మధ్య ఆదివారం ఓ విషయంపై వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. అప్పటికే మద్యం మత్తులో ఉన్న శంకర్ క్షణికావేశంలో కత్తితో రాజశేఖర్ పై దాడి చేసిన విషయం తెలిసిందే. క్షతగాత్రుడిని స్థానికులు రిమ్స్ లో చేర్చగా అక్కడే చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు.. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.