కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట కు చెందిన అత్యాచార నిందితుడు నరేందర్ రెడ్డి కి శిక్ష పడడం పట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం హర్షం వ్యక్తం చేశారు. 2012 లో కోహెడ మండలం పరి వేద గ్రామంలో 21 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి, దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.నిందితున్ని అరెస్టు చేసి, సంవత్సరాలుగా విచారించి సిద్దిపేట కోర్టు నరేందర్ రెడ్డిని దోషిగా ప్రకటిస్తూ 20 సంవత్సరాలు కట్టిన కారాగార జైలు శిక్ష, 1,50,000 /- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పును ఈనెల 10 న ప్రకటించారు. నవాబుపేట గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి మానవ మృగానికి శిక్ష పడి న్యాయం గెలిచిందన్నారు.