బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భీమప్ప అనే వ్యక్తి విష గుళికలు మింగి శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.