అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. పాత గుంటూరులోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ 10వ జిల్లా మహాసభలు జరిగాయి. ఎన్నికల వాగ్దానాలకు అనుగుణంగా తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.