ధర్మవరం పట్టణంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్న గోసల భార్గవ్ (26)అనే యువకుడు ఆదివారం తన ఇంటి మిద్దె పైన రూమ్ లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం తన ఇంటి దేవునికి వెళ్లొచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం రాత్రి భోజనం చేసి ఇంటి మిద్ద పైకి తన నిద్రిస్తున్న రూమ్ లోకి వెళ్ళాడు. ఉదయం ఎంతసేపటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వచ్చి కేసు నమోదు చేసి మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.