మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలు నేపథ్యంలో బాబ్లిగేటు ఎత్తడంతో భారీగా వరద నీరు ప్రవహించింది. దీంతో బాసర గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది. గత మూడు నాలుగు రోజులుగా వరద ఉధృతి పెరిగి బాసర పైసల ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో రైల్వే ట్రాక్ను పరిశీలించిన అధికారులు పలు ట్రైన్లను రద్దు చేశారు. ఈ మేరకు ఆదివారం బాసర గోదావరి నది కి వరద తగ్గడంతో, అధికారులు రైళ్లకు పునః ప్రారంభించినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి తెలిపారు.