నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐఐటి పాముల గ్రామంలోని ఎస్సై పీస్ కమిటీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గ్రామ ప్రజలకు వినాయక మండపాల ఏర్పాటు వేడుకల గురించి వివరించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా డీజే లను ఉపయోగించకుండా ప్రశాంత వాతావరణంలో గణేష్ సంబరాలను జరుపుకోవాలని గ్రామస్తులకు తెలిపారు. పోలీసువారి నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు.