సూర్యాపేట జిల్లా, నడిగూడెం పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ కృష్ణంరాజుపై ఫోక్సో కేసు నమోదయింది. శనివారం మధ్యాహ్నం జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నడిగూడెం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న కృష్ణంరాజు ఇప్పటికే నాలుగు వివాహాలు చేసుకుని, ఐదవ వివాహానికి సిద్దమైనట్లు తెలిపారు. ముగ్గురు యువతులతో పాటు ఒక మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ చేపట్టి కానిస్టేబుల్ కృష్ణంరాజుపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.