రాష్ర్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 21 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇంతవరకు ఫీజ్ రియంబర్స్ మెంటు బకాయిలు చెల్లించక పోవడం పై నిరసన వ్యక్తం చేస్తూ ఏ బి వి పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం దుబ్బాక బస్ స్టాండ్ చౌరస్తాలో ఏ బి వి పి నాయకులు సి ఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ను దహనం చేశారు. ఎ బి వి పి నగర కార్యదర్శి జశ్వంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అని నడుస్తుంది అని చెప్పుకుంటున్న సి ఎం రేవంత్ రెడ్డి కి విద్యార్థుల కష్టాలు, సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.