హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం వేసిన సరిహద్దు దిమ్మలు వెంటనే తొలగించాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పీ.అప్పలనర్స డిమాండ్ చేశారు. సర్వేల పేరుతో అర్థరాత్రి సమయాల్లో డ్రోన్లతో చక్కర్లు కొట్టడం నిలిపివేయాలని కోరారు. ఈమేరకు గిరిజనులతో కలిసి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ కు మంగళవారం సాయంత్రం వినతి అందజేశారు. గిరిజన చట్టాల్ని తుంగలో తొక్కి నిర్మాణాలు చేపడితే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.