పామూరు: సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఊసా వెంకటేశ్వర్లు పై దాడికి పాల్పడ్డ చంద్రశేఖరపురం ఎస్ఐ వెంకటేశ్వర్లు నాయకులు విధుల నుండి తప్పించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పామూరు పట్టణంలో శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సయ్యద్ హనీఫ్ మాట్లాడుతూ.... రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు పై దృష్టిగా ప్రవర్తించడమే కాకుండా ఆయన పై దాడికి పాల్పడ్డ చంద్రశేఖరపురం ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్ ను ఉన్నతాధికారులు వెంటనే విధుల నుండి తప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.