కణేకల్లు మండలం ఎర్రగుంట సమీపంలో కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం బైక్ పై వెళుతున్న బొమ్మనహల్ మండలం ఏలంజి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వ్యక్తులు కణేకల్లు క్రాస్ వైపు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఎదురుగా బళ్లారి వైపు నుంచి వేగంగా వచ్చిన కారు వీరిని డీకొనింది. వారిని ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.